
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని కలవాలన్న విండీస్ వికెట్ కీపర్ జోషువా డి సిల్వ తల్లి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. భారత్ - వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా కింగ్ కోహ్లినిని ఆమె కలుసుకుంది. రెండో రోజు ఆటపూర్తయ్యాక భారత ఆటగాళ్లు తమ హోటల్‌కు తిరిగి వచ్చేందుకు బస్ ఎక్కుతుండగా డా సిల్వా తల్లి కోహ్లిని కలిసింది.
కోహ్లిని చూడగానే ఆమె ఆనందానికి హద్దులు లేకండా పోయాయి. ఈ క్రమంలో కోహ్లిని ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. "నేను కోహ్లిని చూడటానికే స్టేడియంకు వచ్చాను. నేను అతడిని కలవడం ఇదే మొదటి సారి. అతడు గొప్ప మనసు గల వ్యక్తి. అదే విధంగా అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు.
నా కొడుకు జాషువా డా సిల్వా కూడా అతని నుండి చాలా నేర్చుకుంటాడని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా అంతకుముందు రెండో తొలి రోజు ఆట సందర్భంగా కోహ్లి బ్యాటింగ్‌కు చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక జోషువా మాట్లాడుతూ.. ‘మా అమ్మ నాకు ఫోన్ చేసి నేను విరాట్‌ను చూసేందుకు వస్తున్నాను అని చెప్పింది.
అది నేను నమ్మలేకపోతున్నాంటూ అంటూ" అన్నాడు. ఇది అంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇప్పుడు నిజంగానే ఆమో కోహ్లిని చూడటమే కాకుండా కలుసుకుంది కూడా. ఇక ఈ టెస్టులో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 206 బంతుల్లో 121 పరుగులు విరాట్ చేశాడు.
చదవండి: IND vs WI: అయ్యో కోహ్లి.. అలా ఔట్ అవుతావని అనుకోలేదు! వీడియో వైరల్
The moment Joshua Da Silva's mother met Virat Kohli. She hugged and kissed Virat and got emotional. (Vimal Kumar YT).
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
- A beautiful moment! pic.twitter.com/Rn011L1ZXc