టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్ చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాది మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. వన్డే వరల్డ్‌కప్-2003లో సచిన్ 7 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాకుండా వన్డే వరల్డ్‌కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి బ్రేక్ చేశాడు. విరాట్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 674* పరుగులు చేశాడు. అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ 673 పరుగులు సాధించాడు.
అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(13704) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 13751 పరుగులు చేశాడు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో సెమీస్.. టీమిండియాకు భారీ షాక్! శుబ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్
Comments
Please login to add a commentAdd a comment