IND Vs PAK Asia Cup 2022: Virat Kohli Playing Big Shots Against Jadeja, Chahal And Ashwin During India's Training Session, Video Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్‌!

Published Thu, Aug 25 2022 12:44 PM | Last Updated on Thu, Aug 25 2022 1:51 PM

Virat Kohli Smashes India Bowlers During Practice Ahead Of Asia Cup - Sakshi

PC: BCCI

యూఏఈ వేదికగా జరగనున్న ఆసియాకప్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపైనే ఉన్నాయి. గత కొన్ని రోజులగా విశ్రాంతి తీసుకున్న విరాట్‌ తిరిగి ఆసియాకప్‌తోనే బరిలోకి దిగనున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లోనైనా కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందుతాడో లేదో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యా్చ్‌లో పాకిస్తాన్‌తో ఆడనుంది.

అదేవిధంగా కింగ్‌ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను కూడా పాక్‌పై ఆడనుండడం విశేషం. ఇక ఇప్పటికే యూఏఈకు చేరుకున్న కోహ్లి... ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన ప్రాక్టీస్‌లో భాగంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న కోహ్లి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనున్నారు. ఇక ఆసి​యా కప్‌ ఈ సారీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నీలోభారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ సహా క్వాలిఫైయర్స్‌లో విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించిన హాంకాంగ్‌ సైతం పాల్గొనబోతోంది.


చదవండి: Virat Kohli: గడ్డు పరిస్థితులు.. స్పందించిన కోహ్లి! నాకిది అసలు సమస్యే కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement