టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న కోహ్లికి దాదా మద్దతుగా నిలిచాడు. కోహ్లి గొప్ప ఆటగాడని, అతను సాధించిన పరుగులే ఇందుకు సాక్ష్యమని, ఆసియా కప్‌లో రన్ మెషీన్ పూర్వపు ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కోహ్లి తన ఫామ్‌ను అందుకునేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడని, అతనికి తగినన్ని అవకాశాలు కల్పిస్తే పూర్వవైభవం తప్పక సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా కోహ్లి సెంచరీ మాత్రమే సాధించలేదని, జట్టుకు ఉపగయోపడే పరుగులు అతని బ్యాట్ నుంచి జాలువారుతూనే ఉన్నాయని వెనకేసుకొచ్చాడు. స్పోర్ట్స్ తక్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఫామ్‌పై దాదా ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇదే సందర్భంగా దాదా ఐసీసీ అధ్యక్ష పదవిపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్ పదవి రేసులో తాను లేనని.. బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే ఈ విషయంలో ఫైనల్ అని స్పష్టం చేశాడు. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై కూడా దాదా స్పందించాడు. తన దృష్టిలో దాయాదుల పోరు పెద్ద ప్రత్యేకమేమీ కాదని, అన్నీ మ్యాచ్‌ల్లానే ఈ మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌గా భావిస్తానని అన్నాడు. కాగా, ఆగస్ట్ 28న పాక్‌తో మ్యాచ్‌తో ఆసియా కప్‌లో టీమిండియా పోరాటం ప్రారంభమవనున్న విషయం తెలిసిందే.
చదవండి: ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం.. ఎందుకంటే: ఆసీస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment