Virender Sehwag Lauds Death-Over Specialist Arshdeep Singh - Sakshi
Sakshi News home page

Virender Sehwag: 'అప్పుడు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా.. ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్‌'

Published Mon, May 23 2022 9:13 PM | Last Updated on Tue, May 24 2022 11:06 AM

Virender Sehwag lauds death-over specialist Arshdeep Singh - Sakshi

PC: IPL.com

భారత జట్టుకు ఎంపికైన పంజాబ్‌ కింగ్స్‌ యువ పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి భారత దిగ్గజ బౌలర్లతో అర్ష్‌దీప్‌ను సెహ్వాగ్ పోల్చాడు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు తరుపున అర్ష్‌దీప్ సింగ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ 10 వికెట్లు పడగొట్టాడు. అయితే డెత్‌ఓవర్లలో మాత్రం అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

" పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ తరపున డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు వికెట్లు సాధించ లేకపోవచ్చు, కానీ అతడి ఎకానమీ రేట్ అద్భుతంగా ఉంది. అతడు కొత్త బంతితో ఒక ఓవర్‌, స్లాగ్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసే పేసర్‌. నేను ఆడేటప్పుడు జహీర్ ఖాన్,ఆశిష్ నెహ్రా మాత్రమే ఇలా బౌలింగ్‌ చేయడం చూశాను. ఇప్పుడు అర్ష్‌దీప్, బుమ్రా, భువనేశ్వర్ కూడా అఖరి ఓవర్లలో అ‍త్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తున్నారు. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టమని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

చదవండి: Cheteshwar Pujara On IPL 2022: 'ఐపీఎల్‌లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement