భారత్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ 68 పరుగల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే విండీస్‌కు మరో షాక్ తగిలింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం (జూలై 29) జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో విండీస్ జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి వెస్టిండీస్ ఒక ఓవర్ వెనుకబడింది. కాగా ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. "ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున విండీస్ జట్టుకు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించడం జరుగుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం జరగనుంది.
చదవండి: ZIM vs IND: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..?
Comments
Please login to add a commentAdd a comment