లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్‌లో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో డెబ్యూ చేసిన మయాంక్ .. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ పంజాబ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
8 ఓవర్ల తర్వాత బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చిన మయాంక్.. బెయిర్ స్టోను ఔట్ చేసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మలను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్‌గా మయాంక్ తన నాలుగు ఓవర్లలో కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
అంతేకాకుండా ఐపీఎల్-2024లో ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 11 ఓవర్‌లో తొలి బంతిని 155.8 కి.మీ వేగంతో మయాంక్ బౌలింగ్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాజస్తాన్ పేసర్ నండ్రీ బర్గర్(153 కి.మీ వేగం) పేరిట ఉండేది.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఫాసెస్ట్ డెలివరీ వేసిన 5వ బౌలర్‌గా యాదవ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన యువ పేసర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ మయాంక్ యాదవ్..?
21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఢిల్లీలో జన్మించాడు. దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ తరపున మూడు ఫార్మాట్లలో మయాంక్ అరంగేట్రం చేశాడు. తొలుత రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో యాదవ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ తర్వాత లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
గతేడాది జరిగిన దేవధర్ ట్రోఫీలో నార్త్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన మయాంక్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు పడగొట్టి జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 27 మ్యాచ్‌లు ఆడిన 46 వికెట్లు పడగొట్టాడు.
కాగా 2022లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు మయాంక్‌ను లక్నో కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు.అయితే ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని లక్నో సొంతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు.
155.8 Kmph? Bhaii machine kharab hogi pic.twitter.com/RthwiabcD1
— ٰImran Siddique (@imransiddique89) March 30, 2024
Comments
Please login to add a commentAdd a comment