ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం(మే1) చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపనుంది. ఈ మ్యాచ్ పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందాయి. ఎస్‌ఆర్‌హెచ్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చెందగా.. సీఎస్‌కే పంజాబ్ కింగ్స్‌పై పరాజయం పాలైంది.
మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి అవకాశం ఉంది.
ఇక సీఎస్‌కే విషయానికి వస్తే.. బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో సీఎస్‌కే బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే విధంగా ఈ మ్యాచ్‌కు ముందు జడేజా సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. సీఎస్‌కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు ధోని కెప్టెన్సీ వహించనున్నాడు.
హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే
ఇరు జట్లు ఇప్పటి వరకు 17 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. సీఎస్‌కే 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఎస్‌ఆర్‌హెఛ్ కేవలం 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్
ఈ గ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో తక్కువ స్కోర్ నమోదైంది. ఎంసీఏ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకులిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ
చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment