![Whoever beat India will win World Cup 2023: Michael Vaughan - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/26/wasim.jpg.webp?itok=G7JVc0kX)
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌కు మరో 9 రోజుల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించే జట్టుకు టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అందరూ ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేసారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే టీమిండియా సొంతం చేసుకుంది.
ఇండోర్ వేదికగా కంగారులతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏకంగా 399 పరుగుల భారీ స్కోర్‌ను టీమిండియా సాధించింది. గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగగా.. సూర్య, రాహుల్ మెరుపులు మెరిపించాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ప్రదర్శనపై వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"నాకు చాలా స్పష్టత వచ్చేసింది. ఏ జట్టు అయితే భారత్‌ను ఓడిస్తుందో వారే వరల్డ్‌కప్‌ను గెలుస్తారు. సొంత పిచ్‌లపై భారత బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. అదే విధంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా అత్యుత్తమంగా ఉంది. అంతేకాకుండా భారత్ దగ్గర చాలా బౌలింగ్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు" ఎక్స్(ట్విటర్)లో వాన్ రాసుకొచ్చాడు.
మా జట్టుకు దిష్టిపెట్టకు ..
ఇక వాన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఫన్నీగా స్పందించాడు. ‘మా జట్టుకు దిష్టిపెట్టకు’ అనే అర్థం వచ్చేలా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
It’s quite clear to me .. Whoever beats #India will win the WC .. 👍 #INDvAUS .. India’s batting line up on Indian pitches is ridiculous .. Plus they have all the bowling options covered .. it’s the only the pressure of the burden that could stop them .. 👍
— Michael Vaughan (@MichaelVaughan) September 24, 2023
#INDvAUS https://t.co/CWvpXS5vmH pic.twitter.com/vpZ4rgvI3M
— Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2023
Comments
Please login to add a commentAdd a comment