బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండో టెస్ట్ సందర్భంగా అసౌకర్యానికి లోనైన బుమ్రా.. మూడో టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. ఈ విషయమే ఇప్పుడు టీమిండియా అభిమానులను కలవరపెడతుంది. బుమ్రాపై వర్క్ లోడ్ ఎక్కువైపోయి గాయపడ్డాడని సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
ఇప్పటికే భారత్ రెండో టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని తొలి టెస్ట్ ద్వారా లభించిన ఆధిక్యాన్ని తగ్గించుకుంది మూడో టెస్ట్‌లోనైనా టీమిండియా పుంజుకుంటుందా అంటే బుమ్రా రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ సిరీస్‌లో మిగిలిన ఏ ఒక్క మ్యాచ్‌కు బుమ్రా దూరమైన టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. బుమ్రా లేకపోతే టీమిండియా పేస్ విభాగం ఢీలా పడిపోతుంది. సిరాజ్ ఉన్నా ఒక్కడే ఏమీ చేయలేని పరిస్థితి. యువ పేసర్ హర్షిత్ రాణా తొలి టెస్ట్‌లో పర్వాలేదనిపించినా, రెండో టెస్ట్‌లో పూర్తిగా తేలిపోయాడు.
మూడో టెస్ట్‌కు బుమ్రా దూరమైతే ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్‌లలో ఎవరో ఒకరిని బరిలోకి దించాల్సి ఉంటుంది. వీరిద్దరికి అనుభవం అంతంత మాత్రమే. పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను వీరు ఏమాత్రం నిలువరించలేరు. ఇప్పటికిప్పుడు షమీని రంగలోకి తీసుకురావాలన్నా అది సాధ్యపడదు. మూడో టెస్ట్‌కు బుమ్రా నిజంగా దూరమైతే టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి. గాయాన్ని కప్పిపుచ్చి బుమ్రాను బరిలోకి దించుతుందా లేక అనుభవం లేని పేసర్లనే నమ్ముకుని సాహసం చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా, ఐదు మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌లో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. గత ఆసీస్ పర్యటనలోనే భారత్ బ్రిస్బేన్ టెస్ట్‌లో సంచలన విజయం సాధించింది. ఈ పర్యటనలోనూ సేమ్ సీన్‌ను రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తుంది. అయితే కొత్తగా బుమ్రా గాయం అంశం తెరపైకి రావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment