Women's Hockey World Cup 2022: India Play Out A 1-1 Draw Against England - Sakshi

Women Hockey World Cup: ఇంగ్లండ్‌ను నిలువరించిన భారత్‌

Jul 4 2022 5:26 AM | Updated on Jul 4 2022 9:26 AM

Women Hockey World Cup: India, England Play Out 1-1 Draw - Sakshi

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. పూల్‌ ‘బి’లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్‌ 1–1 గోల్స్‌ వద్ద ‘డ్రా’ చేసుకుంది.

ఆట తొమ్మిదో నిమిషంలో ఇసాబెల్లా పెటర్‌ గోల్‌తో ఇంగ్లండ్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 28వ నిమిషంలో లభించిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను వందన కటారియా గోల్‌గా మల్చడంతో భారత్‌ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. తొలి లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక పూల్‌ ‘బి’లోని నాలుగు జట్లు (చైనా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్‌) ఒక్కో పాయింట్‌తో సమంగా ఉన్నాయి. మంగళవారం జరిగే తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో భారత్‌ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement