
ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్: భారత్‌కు ఇప్పటి వరకు ఎన్ని పతకాలు వచ్చాయంటే..
World Junior Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన 14 ఏళ్ల నామ్యా కపూర్ స్వర్ణం గెలుచుకుంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఫైనల్లో ఆమె 36 పాయింట్లు స్కోర్ చేసింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ మనూ భాకర్ కాంస్యం గెలుచుకోగా, ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్ జెడ్‌జెవ్‌స్కీ రజతం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌కు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు వచ్చాయి.
చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు