చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లు బంగ్లా బౌలర్ల దెబ్బకు పెలివియన్‌కు క్యూ కట్టినప్పటకి.. జైశ్వాల్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు.
రిషబ్ పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యశస్వీ 118 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
తన మొదటి 10 ఇన్నింగ్స్‌లలో(స్వదేశంలో) అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. యశస్వీ తన సొంత గడ్డపై మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్‌లలో 755* పరుగులు సాధించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935లో హెడ్లీ విండీస్ గడ్డపై 747 పరుగులు చేశాడు. అయితే 750కి పైగా పరుగులు చేయడం మాత్రం 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment