మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శనివారం టీమిండియా మహిళల జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టాలంటే టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. అందులో భాగంగా మొదట బ్యాటింగ్‌లో సక్సెస్ అయింది. టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 68 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. యస్తికా బాటియా 53, హర్మన్‌ప్రీత్ కౌర్ 50 పరుగులతో రాణించారు. ఇక బౌలర్లు ఫామ్‌లో ఉన్న ఆసీస్‌ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.
కాగా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన యస్తికా బాటియా గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు బాటియా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు ఇంటర్య్వూ ఇచ్చింది. యస్తికా బాటియాకు చికెన్ బిర్యానీ అంటే ప్రాణం. అయితే ఆమె న్యూట్రిషన్ సలహాదారు చికెన్, రైస్ కాంబినేషన్ తింటే.. శరీరం పెరిగే అవకాశం ఉంటుందని.. ఫిట్‌నెస్ కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పాడంటా. అంతే అప్పటినుంచి యస్తికా బాటియా చికెన్ బిర్యానీని వదిలేసింది. ఆటలో రాణించాలని అనుకున్నప్పుడు ఇలాంటి బిర్యానీలు ఎన్నైనా వదులేసుకుంటా అని యస్తికా వెల్లడించింది. అయితే చికెన్ బిర్యానీ వదులుకున్న సమయంలో నా గుండె తట్టుకోలేకపోయిందని.. మనసు చంపుకోలేకపోయానని తెలిపింది.
చికెన్ బిర్యానీతో పాటు ఇంకేమైనా వదిలేశారా?
పానీ పూరి తినడం తగ్గించేశా. కొన్ని సంవత్సరాల కిందట పానీపూరి విపరీతంగా తినేదాన్ని. అమ్మ కోరిక మేరకు ఇంట్లోనే పానీపూరిని తయారు చేసుకోవడం వల్ల బయట తినడం తగ్గించేశాను. అయితే ఒక విషయం మీకు చెప్పాలి. ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత రోడ్‌సైడ్ పానీపూరి తిన్నాను. ఆ మరుసటి రోజే డమొస్టిక్ క్రికెట్లో భాగంగా బరోడా తరపున సెంచరీ బాదడం సంతోషంగా అనిపించింది.
మరి టీమిండియా సహచరులలో ఎవరు బెస్ట్ కుక్ అని భావిస్తున్నారు?
నా జట్టు సహచరులు ఏది తయారు చేసినా తినడానికి ఇష్టపడుతా. అయితే స్మృతి మంధాన మంచి కుక్ అని తెలిసింది. త్వరలోనే ఆమె చేతి వంట రుచి చూస్తా. ఇక బరోడా టీమ్‌మేట్ చార్మి షా మ్యాగీ, ఫిజ్జాలు చేయడంలో మంచి నేర్పరి.
ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నారు.. ఇదే సమయంలో ఇష్టమైన ఫుడ్‌ను మిస్సవుతున్నారా?
అవును.. దాల్ చావల్ మిస్సవుతున్నా. మన సంప్రదాయ ఫుడ్ ఇక్కడ తక్కువగా దొరుకుతుంది. మ్యాచ్‌లు లేని సమయాల్లో మంచి రెస్టారెంట్‌కు వెళ్లి దాల్ చావల్ తింటున్నప్పటికి.. ఎంతైనా ఇంటి ఫుడ్ వేరుగా ఉంటుంది.
మీ బ్యాటింగ్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారా?
ఒక బ్యాటర్‌గా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటా. వన్డే వరల్డ్‌కప్‌లో ఆడడం మాకు పెద్ద విషయం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాకు కీలకం. ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాం.
చదవండి: World Cup 2022: అర్ధ శతకాలతో అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్.. ఆఖర్లో పూజా మెరుపులు
Womens WC 2022 WI vs BAN: విండీస్ క్రికెటర్ వింత ప్రవర్తన.. సూపర్ అంటున్న ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment