నవ్వు ధరిస్తున్నాను: చహల్‌ | Yuzvendra Chahal Shares Photo With His Fiancee Dhanasree | Sakshi
Sakshi News home page

‘మీకు స్వాగతం.. ఎప్పుడు నవ్వుతూ ఉండండి’

Published Fri, Oct 2 2020 9:16 AM | Last Updated on Fri, Oct 2 2020 12:02 PM

Yuzvendra Chahal Shares Photo With His Fiancee Dhanasree  - Sakshi

ప్రస్తుతం ఐపీఎల్‌ సిజన్‌లో బిజీగా ఉన్న టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ గురువారం తన కాబోయే భార్య ధనశ్రీ వర్మతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టుకు అతడు జత చేసిన క్యాప్షన్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇద్దరూ మెట్లపై కూర్చుని ఉండగా.. ధనశ్రీ, చహల్‌ వైపు ఒదిగి కూర్చున్నారు. ఇద్దరూ నవ్వుతూ పోజ్‌ ఇచ్చిన ఈ ఫొటోకు ‘మీరు నాకు ఇచ్చిన నవ్వును.. ధరిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించి రెడ్‌ హర్ట్‌ ఎమోజీతో షేర్‌ చేశాడు. అదే విధంగా ‘మీకు స్వాగతం.. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి’ అంటూ రాసుకొచ్చాడు. ఇక అది చూసిన నెటిజన్లు చహల్‌ క్యాప్షన్‌కు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. (చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా క్రికెటర్‌)

చహల్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరగుతున్న ఐపీఎల్‌ 2020కి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ ప్రారంభంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఇందులో చహల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. అయితే యూట్యూబర్‌, కోరియోగ్రఫర్‌ అయినా ధనశ్రీని త్వరలో పెళ్లాడనున్నట్లు ఆగష్టులో చహల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: 'చహల్‌ కీలకమని ముందే అనుకున్నాం')

I'm wearing the smile you gave me..!! ❤️😘

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement