
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో కొరియోగ్రఫర్, యూట్యూబర్ ధనశ్రీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ఇండియన్ క్రికెటర్ యుజువేంద్ర చహల్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. వీరి పెళ్లికి సంబంధించిన మాటముచ్చటలో భాగంగా ఇరుకుటుంబాలు జరుపుకున్న రోకా కార్యక్రమంలో ధనశ్రీతో కలిసి ఉన్న ఫొటోను చహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏడాది దుబాయ్‌లో జరిగే ఐపీఎల్ కోసం చహల్ యుఏఈ వెళ్లనున్నాడు. ఈ క్రమంలో పర్యటనకు ముందు తనకు కాబోయే భార్య ధనశ్రీతో కలిసి ఉన్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి ‘మీరు నా హార్ట్ పిజ్జాను దొంగిలించారు’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు.
(చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా క్రికెటర్)
దీనికి వెంటనే ధనశ్రీ స్పందిస్తూ.. ‘అవును దొంగిలించాను.. ఒప్పుకుంటున్న’ అంటూ పిజ్జా స్టైస్‌తో పాటు రెండు రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించారు. ఈ ఏడాది దుబాయ్‌లో సెప్టంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరపున స్పిన్నర్ చాహల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇంకా దాదాపు నెలరోజుల సమయం ఉండగానే ఐపీఎల్ ఫ్రాంచైజీలు యుఏఈకి చేరుకున్నాయి. దుబాయ్‌కి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆటగాళ్ల ఫొటోలను ఆర్‌సీబీ టీం షేర్ చేసింది. (చదవండి: చహల్ ఎంగేజ్‌మెంట్.. రోహిత్, సెహ్వాగ్ ఫన్నీ మీమ్స్)
Comments
Please login to add a commentAdd a comment