భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెమటోడ్చుతున్నాయి.
అయితే టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే ఇరు జట్లు ఊహించని షాక్‌లు తగిలాయి. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టు సిరీస్ నుంచి వైదొలగగా.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
ఇక తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా కూడా రాణిస్తాడని జహీర్ థీమా వ్యక్తం చేశాడు.
"రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. జట్టులోని ప్రతీ ఆటగాడికి మద్దతుగా ఉంటాడు. రోహిత్ తన కెప్టెన్సీతో మొత్తం జట్టును ప్రభావితం చేస్తాడు. అదే అతడి కెప్టెన్సీలో స్పెషల్ క్వాలిటీ. అతడు ఇప్పటికే తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో అతడు జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా అదే పంథాలో జట్టును నడిపిస్తాడు. రోహిత్ ఈ సిరీస్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై ఎన్నో అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో కూడా రోహిత్ తన మార్క్ చూపిస్తాడని ఆశిస్తున్నానని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు.
చదవండి: Jasprit Bumrah: 'బజ్‌బాల్‌తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు'
Comments
Please login to add a commentAdd a comment