IPL 2022: Zaheer Khan Says Ishan Kishan Fine After Toe Injury, Available Against Rajasthan Royals - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. గాయం నుంచి కోలుకున్న స్టార్‌ ఓపెనర్‌

Published Fri, Apr 1 2022 5:17 PM | Last Updated on Sat, Apr 2 2022 1:24 PM

Zaheer Khan gives update on MI batter Ishan Kishan - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 2 (శనివారం)న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఇషాన్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కిషన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 81 పరుగులు సాధించాడు.

అయితే ముంబై ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన యార్కర్..  కిషన్ ఎడమ కాలి బొటనవేలికి బలంగా తాకింది. క్రీజులో పరుగులు తీయడానికి కిషన్‌ ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పూర్తిగా ఫీల్డ్‌లోకి రాలేదు. తరువాత అతడిని స్కానింగ్‌కి​ పంపగా.. గాయం అంత తీవ్రమైనది కాదని తేలింది.

ఈ నేపథ్యంలో కిషన్‌ ఫిట్‌నెస్‌గా ఉన్నాడని ముంబై క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు.“ఇషాన్ కిషన్‌ పూర్తి స్థాయి ఫిటెనెస్‌ సాధించాడు. అతడు  క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు కిషన్‌ అందుబాటులో ఉంటాడు’’ అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ మరియు ఇషాన్ కిషన్.

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement