స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు కూడా జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో రెగిస్ చకబ్వా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో గాయపడిన ఎర్విన్ ఇంకా కోలుకోలేదు.
అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎర్విన్‌తో పాటు ఆ జట్టు పేసర్లు బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా కూడా భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. జింబాబ్వే జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వరుస సిరీస్ విజయాలతో జింబాబ్వే దూసుకెళ్తుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను జింబాబ్వే కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో అతిథ్య జట్టు నుంచి భారత్‌కు కూడా గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. ఇక జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. తొలుత శిఖర్ ధావన్‌ను సారధిగా ఎంపిక చేసింది. అయితే భారత స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి ధావన్ స్థానంలో రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇక ఇరు జట్ల మధ్య తొలి వన్డే హరారే వేదికగా ఆగస్టు 18న జరగనుంది.
భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే జట్టు: ర్యాన్ బర్ల్, రెగిస్ చకబ్వా (కెప్టెన్), తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాచి, సికందర్ రజా, మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్
చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment