టీ20 ప్రపంచకప్-2022 వార్మప్ మ్యాచ్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(29 బంతుల్లో 54), హసరంగా(14 బంతుల్లో 37) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
జింబాబ్వే బౌలర్లలో రియాన్ బర్ల్, రజా, మాధవేరే, షుంబా, ఏవెన్స్ తలా వికెట్ సాధించారు. ఇక 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. జింబావ్వే బ్యాటర్లలో మాధవేరే(43) పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ, కరుణరత్నే చెరో రెండు వికెట్లు, డి సిల్వా ఒక్క వికెట్ సాధించారు.
ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్
కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఏకంగా 11 మందితో బౌలింగ్ చేయించి అందరీ ఆశ్చర్యపరిచాడు. వారి టీ20 ప్రపంచకప్ 15 మంది సభ్యల జట్టులో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, వికెట్ కీపర్ చకబావా, మున్యోంగా, మదాండే మినహా మిగితా అందరూ బౌలింగ్ చేశారు.
చదవండి: Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్..
Comments
Please login to add a commentAdd a comment