వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడు, జంగారెడ్డిపల్లి సమీపంలోని తిప్పపై సుమారు 43 ఎకరాల్లో ఇచ్చిన క్వార్ట్ ్జ, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని సోమవారం పలువురు గ్రామస్తులు తహసీల్దార్ హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ తమ గ్రామాల పశువులకు మేత పొరంబోకుగా తిప్ప ప్రాంతం ఉందన్నారు. సమీపంలో గృహాలు కూడా ఉన్నాయన్నారు. మైనింగ్ అనుమతులు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి మైనింగ్ అనుమతులు రద్దు చేసి తమను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్. నాగరాజు, జి కాంతయ్య, ఎస్ రామయ్య, ఎన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
