తడక ఉత్సవం.. భక్తి పారవశ్యం
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం మండలం చెండ్రాయునిపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి తడక ఉత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఏటా మాఘమాసంలో మూడో శనివారం ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే శనివారం తరుగు వంశీయులు, పూజారుల ఉపవాస దీక్షలతో అటవీ ప్రాంతంలో దొరికే వెదురుతో అల్లిన తడకను తీసుకువచ్చి ఆలయం పైభాగాన కప్పారు. ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. చెన్నేకేశవస్వామిని దర్శించుకుని తరించారు.
పల్లె రాక.. భక్తుల కాక
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తడకోత్సవానికి రావడంతో పోలీసులు హడావిడి చేశారు. ఎమ్మెల్యే పూజల్లో ఉన్నంతవరకూ ఆలయం వద్దకు భక్తులు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుమారు గంటన్నర పాటు రోడ్డు మార్గాన్ని మూసి వేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజల అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోయాక... భక్తుల వాహనాలు అనుమతించారు. అప్పటికే ప్రధాన రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. దేవుడి వద్ద కూడా ప్రొటోకాల్ ఏమిటంటూ జనం పల్లెతీరును తూర్పారబట్టారు.
తడక ఉత్సవం.. భక్తి పారవశ్యం
Comments
Please login to add a commentAdd a comment