
‘సైబీరియన్’ స్నేహితులొచ్చారు!
ఖైదీల ఆరోగ్యంపై
నిర్లక్ష్యం తగదు
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి శివప్రసాద్ యాదవ్
హిందూపురం అర్బన్: సబ్‌జైలులోని ఖైదీల ఆరోగ్యంపై జైలు అధికారులు శ్రద్ధ చూపాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యాధికారులతో చికిత్సలు చేయించాలన్నారు. మంగళవారం ఆయన స్థానిక సబ్‌జైలును తనిఖీ చేశారు. సబ్ జైలులో ప్రస్తుతం ఖైదీలు ఎంత మంది ఉన్నారు? ఏయే నేరాల్లో జైలుకు వచ్చారు? వారి న్యాయ సాయం కోసం న్యాయవాదులు ఉన్నారా.. తదితర విషయాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు ప్రభుత్వ పరంగా ఉచిత న్యాయ సాయం అందిస్తామన్నారు. అలాంటి ఖైదీలు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జైలులో ఎవరైనా కుల వివక్ష ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే 18 ఏళ్లు దాటని, 80 ఏళ్లు పైబడిన ఖైదీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘ కాలిక రోగాలున్న ఖైదీలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం జైలు గదులు, వంట గది, శుద్ధజలం, న్యాయ సహాయ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది నవేరా, పారా లీగల్ వలంటీర్ సురేష్, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి పాల్గొన్నారు.
‘జ్ఞానజ్యోతి’తో
బోధన మెరుగు పర్చుకోవాలి
● అంగన్‌వాడీలకు డీఈఓ కృష్ణప్ప సూచన
పుట్టపర్తి టౌన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇస్తున్న ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ ద్వారా బోధన సామర్థ్యాలు మెరుపర్చుకోవాలని డీఈఓ కృష్ణప్ప అంగన్‌వాడీలకు సూచించారు. మంగళవారం కొత్తచెరువులో ఎంపీపీ పాఠశాలలో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లకు ‘జ్ఞానజ్యోతి’ పేరుతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంఽధించి కిట్లు కూడా అందజేసినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీల బోధన సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. శిక్షణ సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జయచంద్ర, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పలత, ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్, రిసోర్స్ పర్సన్లు సాయిశివ, బిందుమాధవి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ వరప్రసాద్, ఓబులేసు పాల్గొన్నారు.
చిలమత్తూరు: సైబీరియన్ స్నేహితులొచ్చారు. మండలంలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సందడి చేస్తున్నారు. సంతానోత్పత్తి కోసం ఏటా మార్చిలో వీరాపురానికి వచ్చే సైబీరియన్ పక్షులు...ఈసారి కాస్త ముందుగానే వచ్చేశాయి. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలోనే వచ్చిన పక్షుల గుంపు... ఇక్కడి వాతావరణ పరిస్థితులను చేసుకుని వెళ్లింది. సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండటంతో వందలాది పక్షులు వేల కి.మీ దూరం ఎగురుతూ వచ్చి వీరాపురం, వెంకటాపురం చేరుకున్నాయి. చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ఎర్రకాళ్ల కొంగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకొని తిరిగి మళ్లీ సైబీరియన్ వెళ్లిపోతాయి.

‘సైబీరియన్’ స్నేహితులొచ్చారు!

‘సైబీరియన్’ స్నేహితులొచ్చారు!

‘సైబీరియన్’ స్నేహితులొచ్చారు!
Comments
Please login to add a commentAdd a comment