
సాయీశ్వరా.. మముబ్రోవరా
ప్రశాంతి నిలయం: సాయీశ్వర నామంతో ప్రశాంతి నిలయం మార్మోగింది. సత్యసాయి.. ఈశ్వరుడి ప్రతిరూపమంటూ కీర్తించారు. సాయీశ్వరా...మముబ్రోవరా అంటూ వేడుకున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా నార్త్ బిల్డింగ్స్ మైదానంలో చేపట్టిన అష్టోత్తర శత సహస్త్ర సాయీశ్వర లింగార్చన ఘట్టం మంగళవారం ముగిసింది. చివరి రోజు లింగార్చనలో పాల్గొన్న భక్తులు ప్రత్యేకంగా రూపొందించిన సాయీశ్వర లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు దంపతులు సాయీశ్వరునికి పూజలు నిర్వహించారు. ఇక అతిరుద్ర మహాయజ్ఞం 6వ రోజు మంగళవారమూ కొనసాగింది. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ మధ్య యజ్ఞ క్రతువు నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు సంబుద్దా ఛటర్జీ బృందం సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతిష్య శాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ ఎస్.మురళీ భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

సాయీశ్వరా.. మముబ్రోవరా

సాయీశ్వరా.. మముబ్రోవరా

సాయీశ్వరా.. మముబ్రోవరా
Comments
Please login to add a commentAdd a comment