
రాజకీయ అండతోనే నాపై దాడి
పెనుకొండ రూరల్: రాజకీయ అండదండలతోనే బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని గుంతకల్లు ప్రభాకర్ అన్నారు. ‘కియా’ పరిశ్రమ సమీపంలోని ఓ భూవివాదానికి సంబంధించి, ఆదివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అనుచరుడైన గుంతకల్లు ప్రభాకర్‌పై ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ అనుచరులు దాడికి దిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుట్టూరులో బాధితుడు గుంతకల్లు ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మునిమడుగు పొలం సర్వే నంబర్ 433లో 1.12 ఎకరాలు, గుట్టూరు పొలం 324లో 61 సెంట్లు మేర తనకు పొలం ఉందన్నారు. తన భూమిలో పనులు చేసుకుంటుంటే రౌడీలను పంపి దాడి చేయడం సరికాదన్నారు. వాటిని కప్పిపుచ్చు కునేందుకు ఎక్కడో ప్రెస్‌మీట్‌లు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
చర్చకు సిద్ధమా ఆదీ..?
‘‘నువ్వు నిజంగా నిజాయితీ పరుడవైతే..న్యాయమైన చర్చకు సిద్ధమా ఆదీ’’ అని గుంతకల్లు ప్రభాకర్ సవాల్ విసిరారు. ‘‘హైదరాబాద్‌కు చెందిన ఓ.. ప్రముఖ వ్యాపారవేత్తను నువ్వు కిడ్నాప్ చేసింది నిజం కాదా...ఈ కేసులో నిన్ను పోలీసులు అరెస్టు చేసింది నిజం కాదా’’ అని ప్రశ్నించారు. ఆదినారాయణపై అక్రమాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, ఫోర్జరీ కేసులు పది వరకు ఉన్నాయన్నారు. అతని లాగా తాను పార్టీలు మార్చేరకం కాదన్నారు. గ్లోబుల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి 250 ఎకరాల భూమిపై కోర్టు కేసు నడుస్తున్న మాట వాస్తవమేనని, అందులోని 88 ఎకరాలకు తన భాగస్తుడికి కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఆ భూములకు, దాడికి కారణమైన తన భూమికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తాము నిజాయితీ పరులమని, కాబట్టే తాము మోసపోయామన్నారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని ఆదినారాయణను ఈ సందర్భంగా ప్రభాకర్ హెచ్చరించారు.
సమావేశంలో గుంతకల్లు ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment