
నిలకడగా ఎండుమిర్చి ధరలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు మార్కెట్‌లో నిలకడగా ఉన్నాయి. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 113.50 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటిరకం ఎండుమిర్చి క్వింటా రూ.15 వేలు, రెండో రకం రూ.13,500, మూడో రకం క్వింటా ఎండుమిర్చి రూ.8 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రశేఖర్ తెలిపారు.
శ్రీవారి పాదాలను తాకిన సూర్య కిరణాలు
హిందూపురం అర్బన్: స్థానిక పేట వేంకటరమణ స్వామి మూలవిరాట్ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే తొలి మంగళవారం ఉదయం 7 గంటలకు ఈ అరుదైన ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తెల్లవారుజామునే ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూలవిరాట్‌ను సూర్వకిరణాలు తాకిన అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

నిలకడగా ఎండుమిర్చి ధరలు
Comments
Please login to add a commentAdd a comment