మామిడి తోటకు నిప్పు
మడకశిర రూరల్: మండలంలోని సి.రంగాపురం గ్రామ సమీపంలో రైతు చెన్నరాయప్ప సాగు చేసిన మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పంటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు మామిడి తోటతో పాటు పక్కనే ఉన్న మొక్క జొన్న పంట కాలిపోయింది. తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల ఆరోగ్యంపై
దృష్టి సారించండి : డీఈఓ
కనగానపల్లి: వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యంపై దృష్టిసారించాలని ఉపాధ్యాయులకు డీఈఓ కిష్టయ్య సూచించారు. కనగానపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్‌ను గురువారం ధర్మవరం ఆర్డీఓ మహేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఈఓ ఉన్నారు. కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పాఠశాల, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ గదులు, వంటశాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని డీఈఓ ఆదేశించారు. విద్యార్థులకు ప్యూరిఫైడ్ నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుణమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు: మండలంలోని వెంకటాంపల్లిలో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రఽథోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. దాదాపు 9 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందిన రైతు ఇంద్రారెడ్డి వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి.
మామిడి తోటకు నిప్పు
Comments
Please login to add a commentAdd a comment