
రైతుల సమక్షంలోనే రీసర్వే చేపట్టాలి
ప్రశాంతి నిలయం: భూ యజమానితో పాటు చుట్టుపక్కల పొలాల రైతుల సమక్షంలోనే రీసర్వే చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో రీ సర్వేపై సమీక్షించారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వెబ్ ల్యాండ్ రికార్డుల ప్రకారం రీ సర్వే నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి రీ సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుందో సర్వే ఏడీఈలు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుర్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్‌కుమార్, శర్మ, మహేష్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.
పీపుల్ సర్వేతో పేదల జీవితాల్లో వెలుగులు
పీపుల్ సర్వే–4తో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఈ సర్వే ద్వారా జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడంతో పాటు వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండలాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ–4 సర్వేపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకూ సర్వే చేపట్టి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ నమోదు చేయాలని ఆదేశించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడంలో భాగంగా పక్కా గృహం, విద్యుత్ సౌకర్యం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, స్థిర, చర ఆస్తులు లేని వారిని గుర్తించి అర్హులుగా చేర్చాలన్నారు. అంతకుముందు కలెక్టర్ చేతన్ పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డు ప్రశాంతి గ్రామంలో జరుగుతున్న పీ–4 సర్వేను పరిశీలించారు. లీలావతి, రూప, ఓబులేసు ఇళ్లలోని వివరాలను అడిగి తెలుసుకుని సర్వేలో నమోదు చేశారు. కలెక్టర్ వెంట పలు శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్

రైతుల సమక్షంలోనే రీసర్వే చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment