
సమష్టి కృషితోనే నేర నియంత్రణ
పుట్టపర్తి టౌన్: జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులంతా సమష్టిగా పనిచేయాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించాలని, ఆయా కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నెలవారీ నేర సమీక్ష చేశారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, హత్యలు, చోరీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేర నియంత్రణలో ప్రతిభ కనబరచిన 67 మంది పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఏదైనా కేసు నమోదు చేసిన 60 రోజుల్లోపు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళా భద్రతపై దృష్టి సారించాలని, ఉమెన్ హెల్ప్ డెస్క్‌లో వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్ కెమెరాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. రోజూ విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేసి పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్‌కుమార్, ఆదినారాయణ, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్ కుమార్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఐటీ కోర్ ఇన్‌చార్జ్ సుదర్శన్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
లాంగ్ పెండింగ్ కేసులపై
దృష్టి సారించండి
నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ రత్న

సమష్టి కృషితోనే నేర నియంత్రణ
Comments
Please login to add a commentAdd a comment