
పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక
ఇది పెనుకొండ పట్టణంలో కొండపైకి వెళ్లే దారిలోని చెత్త డంప్. ఇక్కడున్న చెత్తను మరో ప్రాంతానికి తరలించే పనులను మంత్రి సవిత 3 నెలలు కిందట అట్టహాసంగా ప్రారంభించారు. ఫొటోలకు ఫోజులిచ్చి హడావుడి చేశారు. అయితే అక్కడున్న చెత్త ఇప్పటికీ అలాగే ఉంది. చెత్త తరలింపునకు తీసువచ్చిన వాహనాలు ఒక్కటీ ఇప్పుడు కనిపించడం లేదు. నిన్నటి వరకు ఉన్న యంత్రాలు కూడా వెనుదిరిగాయి. రోజుల తరబడి చెత్త ఉండిపోవడంతో వీధంతా దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నారు. పెనుకొండ సుందరీకరణ పనులు జరుగుతున్న తీరు..మంత్రి సవిత పనితీరుకు ఇదో నిదర్శనం మాత్రమే.
మాట నిలుపుకోవాలి
పెనుకొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్న మంత్రి సవిత మాట నిలుపుకోవాలి. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పట్టణ సుందరీకరణకు కృషి చేస్తానని ఎన్నో సార్లు చెప్పినా... కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా విద్యుత్ లైట్లు లేక మెయిన్ రోడ్లలోనే అంధకారం నెలకొంది. ప్రజలు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
– ఫరీద్, దర్గాపేట, పెనుకొండ
సుందరీకరణకు సహకరిస్తాం
పట్టణ సుందరీకరణ పనులకు మా సహకారం తప్పక ఉంటుంది. కానీ మంత్రి సవిత కేవలం మాటలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న పట్టణాభివృద్ధిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
– రఘునాథరెడ్డి, కౌన్సిలర్, పెనుకొండ
సహకారం తీసుకుంటాం
మున్సిపాల్టీలో నిధుల కొరత ఉంది. అందువల్ల పట్టణ సుందరీకరణ పనులకు దాతల సహకారం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచీ నిధులు రాబట్టి స్థానిక ఎన్నికలు నాటికి సుందరీకరణ పనులు పూర్తయ్యేలా చూస్తాం
– సవిత, బీసీ సంక్షేమశాఖా మంత్రి
డివైడర్ల మధ్య మట్టి మాయం..
నగర సుందరీకరణ పనుల్లో భాగంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు డివైడర్‌ల మధ్య మట్టిని నింపి మొక్కలు నాటడానికి కార్యాచరణ ప్రారంభించారు. మార్కెట్‌యార్డ్ నుంచి 44వ జాతీయ రహదారి వరకూ డివైడర్ల మధ్యలో మట్టిని నింపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొందరు నాయకులు ఉన్న మట్టిని బయటకు తరలించి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా ఎర్ర మట్టిని నింపి మొక్కలు నాటుతారన్న ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చడం లేదు. దీంతో సుందరీకరణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పెనుకొండ: పట్టణ సుందరీకరణ పనులు అటకెక్కాయి. పెనుకొండ రూపురేఖలు మార్చేస్తామని హామీలు గుప్పించిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సవిత మాటలు నీటి మీద రాతలుగానే మారాయి.
గతమెంతో ఘనం..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెనుకొండ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పెనుకొండను నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేసి రోడ్ల అభివృద్ధికి రూ. 40 కోట్లు మంజూరు చేశారు. 44వ జాతీయ రహదారి నుంచి మార్కెట్ యార్డ్ వరకు, మడకశిర రోడ్డు నుంచి షీఫారం వరకూ డబుల్ లేన్ రోడ్డుకు సహకారం అందించారు. మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ. 475 కోట్ల మేర మంజూరు చేశారు.
అధ్వానంగా రోడ్లు..
ప్రస్తుతం పట్టణ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయి. పట్టణంలోని కోనాపురం రహదారి చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు నిర్మాణానికి ఇటీవల మంత్రి సవిత భూమి పూజ చేసినా... పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ రోడ్డు కూడా ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని దాదాపు నాలుగు కి.మీ మేర ఉన్న రహదారిపై బటర్ ఫ్లై లైట్లను ఏర్పాటు చేస్తామని చెప్పినా... ఇంత వరకూ ఆ దిశగా పనులు మాత్రం జరగలేదు. దీంతో ప్రధాన రహదారి మీదనే అంధకారం నెలకొంది.
వీధుల్లో దుర్వాసన..
పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న డ్రైనేజీ నుంచి వస్తున్న దుర్వాసన తట్టుకోలేక రోగులు అల్లాడిపోతున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో మురుగు బయటకు వస్తుండటంతో దోమలు వ్యాప్తి అధికంగా ఉంది.
పెనుకొండ కోటపై
నిర్లక్ష్యపు జెండా
పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించని
మంత్రి సవిత
తూతూ మంత్రంగా
డివైడర్ల మధ్య మొక్కలు
పడకేసిన పారిశుధ్యం..
పట్టణమంతా దుర్గంధం
రోడ్డుపై లైట్లు కూడా
ఏర్పాటు చేయని వైనం

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక

పెనుకొండ... ఈ పేరు చెబితేనే విజయనగర వైభవం కళ్లముందు సాక
Comments
Please login to add a commentAdd a comment