వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్‌గా ఆసీఫ్–ఉల్లా
చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్‌గా 30వ వార్డు కౌన్సిలర్ ఎస్.ఎం.ఆసీఫ్–ఉల్లాను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల సమావేశంలో పలు అంశాలపై దీపిక చర్చించారు. అనంతరం ఫ్లోర్ లీడర్‌గా ఆసీఫ్–ఉల్లా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా 24వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రబాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దొడ్డి దారిన హిందూపురం మున్సిపాలిటీని దక్కించుకున్న టీడీపీకి కౌన్సిల్ సమావేశాల్లో తగిన గుణపాఠం చెపుతామన్నారు. మున్సిపాలిటీలో అక్రమాలు చేయడానికే వారు దుశ్చర్య పాల్పడ్డారని, వారి ఆటలో సాగనివ్వబోమని అన్నారు. ఆసీఫ్–ఉల్లా మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం మేరకు, సమన్వయకర్త దీపిక ఆదేశానుసారం కౌన్సిల్‌లో ప్రజల తరఫున నిలిచి పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్ శివ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment