నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయవచ్చని తెలిపారు.
ఎస్పీ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఎస్పీ వి.రత్న ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొనిరావాలన్నారు. ప్రజలు వివిధ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
భూకబ్జాకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్
హిందూపురం: తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కొట్టేయాలని చూసిన ముగ్గురి అరెస్టు చేసినట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన వివరాలమేరకు... మండలంలోని సంతేబిదనూర్‌కు చెందిన ఎస్‌ఎన్.శివయ్య, హిందూపురం వాసవిఽ ధర్మశాలకు ఏరియాకు చెందిన ఆర్.భరత్, హిందూపురంలోని గాంఽధీనగర్‌కు చెందిన కె.ఫైరోజ్‌ఖాన్ మండలంలోని కిరికెర గ్రామంలో సర్వేనెంబర్ 243–2లోని ప్లాటు నంబరు 91కి సంబంధించి తప్పుడు పత్రాలు, ఆధార్‌కార్డులను సృష్టించారు. ఇందులో భాగంగానే ఆ భూమిని కబ్జా చేశారు. ఏకంగా ఇల్లు కట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ భూమి అసలు యజమానురాలు, ముద్దిరెడ్డిపల్లికి చెందిన సువర్ణమ్మ ఆ భూమి తనదని వారితో వాదించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు అన్ని ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి తప్పుడు పత్రాలతో మోసం చేసేందుకు ప్రయత్నించిన శివయ్య, భరత్, ఫైరోజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారిని ఏడు రోజులు రిమాండ్‌కు ఆదేశించారు.
రాష్ట్రపతి భవన్ నుంచి పట్టు చీరల డిజైనర్‌కు ఆహ్వానం
ధర్మవరం: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజుకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం కల్పించేందుకు అమృత్ మహోత్సవంలో భాగంగా ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎక్స్‌పోలో పాల్గొనాలని తనను ఆహ్వానించారన్నారు. దేశ రాజధానిలో ధర్మవరం పట్టుచీరల ప్రత్యేకత తెలిపే అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని నాగరాజు తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఎక్స్‌పో ఉంటుందన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Comments
Please login to add a commentAdd a comment