ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
ధర్మవరం: ప్రభుత్వ ఉద్యోగులంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీఎన్‌బీ గార్డెన్స్‌లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రథమ కౌన్సిల్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలకు, ప్రజలకు అనుకూలంగా విధులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. పీఆర్‌సీపై ప్రభుత్వం తక్షణం జుడీషియల్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఆలస్యమైన దృష్ట్యా ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవులు, జీపీఎఫ్ లోన్ల ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎఫ్‌ఆర్‌సీ, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మూడు దశాబ్ధాలుగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సమస్యను తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కోరారు. పదవీ విరమణ వయస్సు మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు వర్తింపచేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పక్షాన నిలబడే ఏకై క సంఘం ప్రభుత్వ ఉద్యోగుల సంఘమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామంజనేయులు యాదవ్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ బాజీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేదార్‌నాథ్, ఐక్యవేదిక కోచైర్మన్ కరణం హరికృష్ణ, ఏపీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మరెడ్డి, ఎంటీఎస్, ఎన్‌ఎంఆర్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment