నిలకడగా చింతపండు ధరలు
హిందూపురం అర్బన్: మార్కెట్‌లో చింతపండు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 1,390 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 13 వేలు, కనిష్టంగా రూ.4,500, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌లో చింత పండు ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో చిరు వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు 214 మంది గైర్హాజరు
పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష 42 కేంద్రాల్లో నిర్వహించారు. ఒకేషనల్, జనరల్ విభాగాల్లో 214 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,256 మంది గాను 9,080 మంది హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,141 మందికి గాను 1,103 మంది మాత్రమే హాజరయ్యారు. రెండు విభాగాల్లోనూ కలిపి 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
‘పచ్చ’ పైశాచికం!
● వివాహితను వేధించిన
టీడీపీ నాయకుడు, కేసు నమోదు
పెనుకొండ రూరల్: వివాహితను వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకుడితో పాటు అతని తల్లి, భార్యపై ‘కియా’ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు... మండలంలోని వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం మధ్యాహ్నం ఇంటి ఎదుట దుస్తులు ఉతుక్కుంటుండగా... అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వడ్డి మంజునాఽథ్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పారిపోయాడు. ఆయితే మంజునాథ్ గ్రామం వదలి వెళ్లేందుకు సదరు వివాహితనే కారణమంటూ మంజునాథ్ తల్లి, భార్య ఇతర కుటుంబ సభ్యులు వివాహితపై దాడి చేశారు. దీంతో బాధితురాలు ‘కియా’ పోలీసులకు ఫిర్యాదు చేయగా...మంజునాథ్‌తో పాటు అతని తల్లి, భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
నిలకడగా చింతపండు ధరలు
Comments
Please login to add a commentAdd a comment