హెంజేరు.. భక్తజనహోరు
‘ఓం నమఃశివాయ’ అన్న పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనించింది. ఓంకార నాదం మార్మోగింది. ‘సిద్ధేశ్వరస్వామికి జై’ అంటూ భక్తకోటి చేసిన నినాదం హోరెత్తింది. శివనామస్మరణ మధ్య హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం సోమవారం రమణీయంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఓంకారనాదం చేస్తూ రథాన్ని ముందుకులాగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం రథంపైకి అరటిపండ్లు, బెల్లం, పూలు, మిరియాలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన గురువులు చేసిన ‘వీరగాసే’ నృత్యం ఆకట్టుకుంది.
– హేమావతి (అమరాపురం):
వైభవంగా సిద్ధేశ్వరస్వామి
బ్రహ్మరథోత్సవం
హెంజేరు.. భక్తజనహోరు
Comments
Please login to add a commentAdd a comment