రీ సర్వే పక్కాగా చేయాలి
లేపాక్షి: భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అఽధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని మానేపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. భూముల రీ సర్వే వల్ల అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. అలాగే భూ తగాదాలను శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో, సర్వేయర్‌తో మాట్లాడి రీ సర్వేలో ఉత్పన్నమైన సమస్యలు, గ్రౌండ్ వాలిడేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఏడిఏ అల్తాఫ్ అలీఖాన్, ఏఓ శ్రీలత, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.
ఈ–క్రాప్ సూపర్ చెక్..
ఈ–క్రాప్ సూపర్ చెక్‌లో భాగంగా జేసీ అభిషేక్‌కుమార్ కొండూరు గ్రామ రైతులు నందిని, ఈడిగ వెంకటరమణప్ప సాగు చేసిన రాగిపంటను, లేపాక్షి గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో ఈ–క్రాప్ బుకింగ్ విధానం, పంట దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన విస్తీర్ణం, పంట వివరాలను పరిశీలించారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ..
లేపాక్షి తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్‌ఓలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన అందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాల క్రమబద్దీకరణ, పొజిషన్ సర్టిఫికెట్, ఫ్రీ హోల్డ్ వెరిఫికేషన్, భూ కేటాయింపు పరిశీలన తదితర అంశాలపై తగు సూచనలు ఇచ్చారు.
అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment