నవోదయంతో నాటుసారా నిర్మూలన
ప్రశాంతి నిలయం: నాటుసారా రహిత జిల్లాగా శ్రీసత్యసాయిని తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ‘నవోదయం 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి నాటుసారా నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. అందుకోసం ఎకై ్సజ్ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా నాటుసారా అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన కళాజాత బృందం ప్రచార రథాన్ని బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కళాజాతా బృందాలు నాటుసారా వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి చైతన్యం తేవాలన్నారు. కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనాలని ఆదేశించారు. గ్రామ, పట్టణ, డివిజన్ స్థాయిల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య ఇబ్బందులు, సామాజిక, ఆర్థిక సమస్యలపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment