వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘పూల’
కదిరి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కదిరికి చెందిన పూల శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పూల శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. 2014తో పాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు ఎంతో కృషి చేశారు. పార్టీ సీఈసీ సభ్యులుగా, గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. తన సేవలను గుర్తించి పదవి కట్టబెట్టిన పార్టీ అధినేతకు, పార్టీ పెద్దలకు పూలశ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తానని, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.
ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి
అనంతపురం సెంట్రల్: శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా టి. శ్రీదేవి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె తాడిపత్రి సీడీపీఓగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తాడిపత్రి సీడీపీఓగా ఉన్న టి.శ్రీదేవికి శ్రీసత్యసాయి జిల్లా పీడీగా అదనపు బాధ్యతలు (ఆన్‌డ్యూటీ) అప్పగించారు. అలాగే అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీగా ఎం.నాగమణిని నియమించారు. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా మంత్రాలయం సీడీపీఓగా పనిచేస్తుండగా, పదోన్నతి కల్పించి పీడీగా బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment