
రైలు కిందపడి వలస కార్మికుడి మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం–మలుగూరు రైల్వేస్టేషన్ మధ్య శుక్రవారం ఓ వ్యక్తి రైలుకింద పడి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇస్రార్(35) హిందూపురం టీచర్స్ కాలనీలో ఓ బ్యూటీపార్లర్‌లో పని చేసేవాడు. సొంతూరుకు వెళ్లే క్రమంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్యూటీపార్లర్ నిర్వాహకుడు సుధాకర్‌నాయుడు సహకారంతో మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.
క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులు.. మహిళ ఆత్మహత్య
మడకశిరరూరల్: క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులకు గురిచేయడంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పత్తికుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప భార్య రత్నమ్మ అనారోగ్యంతో బాధపడుతుండేది. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. అదే గ్రామానికి చెందిన నాగమణి(39) క్షుద్ర పూజ చేయించడంతోనే తన భార్యకు నయం కాలేదని అనుమానంతో హనుమంతరాయప్ప, కుటుంబ సభ్యులు నాగమణిని వేధించేవారు. ఈక్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శుక్రవారం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వ్యక్తిపై హత్యాయత్నం
తనకల్లు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో వలి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు..నల్లచెరువు మండలం మల్లిరెడ్డిపల్లికి చెందిన వలి బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వలి మూడు రోజులుగా తనకల్లులో ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని మోరీ వద్ద ఉన్న వలిపై బైక్‌పై వచ్చి అగంతకులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. ఎస్‌ఐ గోపి హుటాహుటినా బాధితుడిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రైలు కిందపడి వలస కార్మికుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment