పుట్టపర్తి అర్బన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు గురువారంతో ముగిసినట్లు డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్ పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వహించామన్నారు. ఇందులో కౌన్సిలింగ్ మెంబర్, కన్వీనర్ డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు. 21 ఏపీఓలు, 50 మంది సీసీలు, 18 మంది ఈసీలు, 81 మంది టీఏలు, ప్లాంటేషన్ సూపర్‌వైజర్ కలిపి మొత్తం 171 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మీ, ఏపీడీ శివశంకర్, హెచ్‌ఆర్ మేనేజర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు.
క్వింటా చింతపండు
రూ.33 వేలు
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.33 వేలు పలికింది. గురువారం మార్కెట్‌కు 1,891.80 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.33 వేలు, కనిష్టంగా రూ.8,100, సరాసరిన రూ.18 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.4,320, సరాసరిన రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
న్యూస్‌రీల్
‘డ్వామా’లో ముగిసిన బదిలీలు