అనంతపురం అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం–వాల్టా (ఏపీ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్–2002) ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 64 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ జారీ చేసింది. ఆయా గ్రామాల్లో అత్యధిక నీటి వినియోగం ఉన్నట్లు గుర్తించారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితోనే తాగునీటి అవసరాల కోసం మాత్రమే బోరుబావుల తవ్వకం చేయాలని స్పష్టం చేసింది.
● పుట్లూరు మండలం కోమటికుంట్ల, మడుగుపల్లి, తాడిపత్రి మండలం బోడాయిపల్లి, బొందలదిన్నె, హుస్సేనాపురం, సజ్జలదిన్నె, తాడిపత్రి రూరల్ పంచాయతీ, యల్లనూరు మండలం అరవేడు, బొప్పేపల్లి, మేడికుర్తి, పెద్దమల్లేపల్లి, తిరుమలాపురం, వేములపల్లె గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
● రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో 300 గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 94 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం– 76, శ్రీ సత్యసాయి–51, వైఎస్సార్ కడప– 32, చిత్తూరు– 18, పల్నాడు– 16, అనంతపురం –13, అన్నమయ్య జిల్లాలో ఒక గ్రామం... ఇలా మొత్తం 300 గ్రామాల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు భూగర్భజలశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.తిప్పేస్వామి తెలిపారు.
‘అనంత’లో 13 గ్రామాలు,
‘శ్రీ సత్యసాయి’లో 51 గ్రామాలు
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్
జిల్లా పరిధిలో..
శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో అత్యధికంగా 51 గ్రామాల్లో ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూడి, పి.బ్యాడిగేరె, రావుడి, అమడగూరు మండలం కరిణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, అమరాపురం మండలం తమ్మిడేహళ్లి, చిలమత్తూరు మండలం ధేమకేతేపల్లి, హుస్సేనాపురం, గాండ్లపెంట మండలం చామచాయనబైలు, చామలగొంది, గాండ్లపెంట, జీనుగులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుపల్లి, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె, గోళ్లాపురం, కిరికెర, కొటిపి, కొట్నూరు, మలుగూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, లేపాక్షి మండలం చోళసముద్రం, ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, గౌకనపల్లి, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి, కాకి, ఎం.రాయాపురం, రొళ్ల, తాడిమర్రి మండలం దాడితోట, తలుపుల మండలం పులిగుండ్లపల్లె, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం, బొంతలపల్లె, చీకటిమానిపల్లి, దిగువమందలపల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుంలు ఉన్నాయి.