
●ఆకట్టుకున్న గ్రామీణ క్రీడాపోటీలు
తాడిపత్రి టౌన్/గార్లదిన్నె: ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక పెన్నానది ఒడ్డున ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలు ఆకట్టుకున్నాయి. ఇరుసు, రాతిగుండ్లు, ఇసుక బస్తాలు ఎత్తు పోటీల్లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్‌లను అందజేసారు. అలాగే గార్లదిన్నె మండలం కల్లూరు ఇసుక మూట మోసే పోటీలు నిర్వహించారు. పోటీలు ఆరంభం నుంచే హోరాహోరీగా సాగాయి. ఎక్కువ దూరం ఇసుక మూటను మోసుకెళ్లిన యువకుడికి నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.

●ఆకట్టుకున్న గ్రామీణ క్రీడాపోటీలు