రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం

Published Sun, Mar 16 2025 1:36 AM | Last Updated on Sun, Mar 16 2025 1:36 AM

రెవెన

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉద్యోగులకు సేవలు అందించడంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా రెవెన్యూ వసతి గృహం ఆధునికీకరణ, మెగా మెడికల్‌ క్యాంపు ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాకు చెందిన సీనియర్‌ రెవెన్యూ అసోసియేషన్‌ సభ్యులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, పి.జగన్‌మోహన్‌రావు, ఎం.కాళీప్రసాద్‌లను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం కార్యదిర్శ రామశెట్టి రాజేష్‌, జిల్లా అధ్యక్షుడు కె. శ్రీరాములు, కార్యదర్శి బి.వి.ఎస్‌.ఎన్‌.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, దిలీప్‌ చక్రవర్తి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జెమ్స్‌లో అవగాహన సదస్సు

శ్రీకాకుళం రూరల్‌ : రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాలు – శిక్షణా తరగతులపై ఈ నెలాఖరున అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు హాజరవుతారని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఏడాది శిక్షణ కాలంలో స్టైఫండ్‌ కూడా అందిస్తామని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

డయాలసిస్‌ యూనిట్లు ప్రారంభం

కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో శనివారం ఎనిమిది నూతన డయాలసిస్‌ యూనిట్లను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాల ప్రారంభించారు. అనంతరం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ సెక్రటరీ వెంకన్న చౌదరి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పద్మజ, నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గుజరాత్‌లో వలస కూలీ మృతి

వజ్రపుకొత్తూరు రూరల్‌: మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వలస కూలీ వంక ప్రకాశ్‌ (36) గుజరాత్‌లో శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఆరు నెలల కిందటే మృతి చెందాడు. నిరుపేద కుటుంబంలో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రకాశ్‌కు తల్లి హేమలత, భార్య లలిత ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు ,స్థానికులు కోరుతున్నారు.

చీరకు నిప్పంటుకుని

వృద్ధురాలి మృతి

రణస్థలం: మండలంలోని జె.ఆర్‌.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నారాయణశెట్టి రవణమ్మ(63) అనే వృద్ధురాలి చీరకు నిప్పంటుకోవడంతో గాయాలపాలై మృతిచెందింది. జె.ఆర్‌.పురం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రవణమ్మ శుక్రవారం రాత్రి 9ః30 గంటల సమయంలో ఇంట్లో కరెంట్‌ పోవడంతో కొవ్వొత్తి వెలిగించగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని మోకాలి వరకు పూర్తిగా కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమెకు భర్త సత్యనారాయణ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి కేసు నమోధు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి వివరాలు లభ్యం

ఎచ్చెర్ల క్యాంపస్‌ : ఎచ్చెర్ల మండలం జరజాం జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 13న తుప్పల్లో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా..మృతుడు ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన ఎరగడ రాముగా గుర్తించారు.

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం 
1
1/2

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం 
2
2/2

రెవెన్యూ అసోసియేషన్‌ సేవలు ప్రశంసనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement