జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన శిర్రాకిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.
దేవరవలసలో అగ్ని ప్రమాదం
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామంలో అప్పారావు, అప్పలదాస్, సూర్యారావులకు చెందిన సుమారు వంద బస్తాల ధాన్యం కట్టలు, ఐదు ఎకరాల గడ్డివాములు బుధవారం రాత్రి 2 గంటల సమయంలో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల మేరకు నష్టం చేకూరింది. రాత్రి సమయంలో ఎవరైనా దుండగులు నిప్పుపెట్టారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.