● ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలు
● సాక్షి కథనానికి స్పందన
శ్రీకాకుళం క్రైమ్: ‘డే అండ్ నైట్.. వెరీ టైట్..’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. నగరంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ సీఐ నాగరాజు గురువారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆటోయూనియన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో ఎక్కడి పడితే అక్కడ ఆటోలు పార్కింగ్ చేస్తూ ఉంచరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సీఐ సూచించగా దానికి ఆటో యూనియన్ వారు తమ యూనియన్ పరిధిలో ఎవరూ అలా పార్కింగ్ చేయరని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే అలా చేస్తుంటారన్నారు.
ఆర్టీసీకి లెటర్ పెట్టాం..
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ నాగరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ డే అండ్ నైట్ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేస్తున్న విషయంపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి లెటర్ పెట్టామని, జంక్షన్ సమీపంలో టీవీఎస్ షోరూం వద్ద ఆపమని చెప్పామన్నారు. ఆటోలు కూడా రన్నింగ్‌లో ఉంటే ట్రాఫిక్ ఏర్పడదని వారికి సూచనలు అందించామన్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్ మార్గంలోను, సింధూర జంక్షన్‌లో ఇప్పటికే బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి