
●కూర్మో రక్షతి రక్షితః
సముద్రంలో తాబేళ్లు ఉండడం మానవాళికి మంచిదని, మత్స్య సంపద పెరుగుదలకు ఇవి దోహదపడతాయని, అందుకే వాటిని రక్షించాలని బ్రాహ్మణతర్లా హైస్కూలు జాతీయ హరిత క్లబ్ క్లస్టర్ కో ఆర్డినేటర్ కొయ్యల శ్రీనివాసరావు చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో గల అటవీ శాఖ, ట్రీ ఫౌండేష న్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని సోమవారం పలాస మండలం బ్రాహ్మణతర్లా విద్యార్థులు సందర్శించారు. ముందుగా విద్యార్థులు తీరంలోని వ్యర్థాలను ఏరి బీచ్‌ను శుభ్రం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హేచరీలలో పొదిగిన తాబేలు పిల్లలను సముద్రంలోని విడిచిపెట్టారు. కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు బీటీఓ టి.తిరుపతిరావు, ట్రీ ఫౌండేషన్ వలంటీర్ షేక్ ఖాసిం, ప్రధానోపాధ్యాయులు ఎస్వీ రమణరావు, కొయ్యల శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. –పలాస