
హోంమంత్రి బురద రాజకీయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
‘నరసన్నపేటలోని ఒక టెంపుల్‌పై జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చిపై జై శ్రీరామ్ అని రాయించారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఏదో విధంగా మత కల్లోలాలు తీసుకురావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూను క్రియట్ చేయాలన్న దృక్పథం చాలా క్లియర్‌గా కన్పిస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెబుతున్నాను.. ఒక క్రిమినల్ పాలిటిక్స్‌లో ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయడానికి రెడీ అవుతున్నారు. అయినా వారు ఏమీ చేయలేరు.మేమంతా అలెర్ట్‌గా ఉన్నాం’ అంటూ మంగళవారం మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని స్పష్టమైంది. ఆయా రాతలకు సంబంధించి ముగ్గురు అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. జలుమూరు మండలం యలమంచిలి గ్రామం ఎండల కామేశ్వరస్వామి గుడి లోపలి కాంపౌండ్ గోడపై, అదే గ్రామంలో అసిరితల్లి గుడి వద్ద, కామినాయుడుపేట కొండపోలవలసలో ఆంజనేయస్వామి గుడి గోడపై మతపరమైన రాతలపై పోలీసులు విచారణ జరిపి పీటర్ జాన్, పాగోటి ఈశ్వరరావు, మామిడి అజయ్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలతో వీరు గత నెల 29వ తేదీన ఆ రాతలు రాసినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈనెల 14న మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా, ఈ నెల 1న శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్డులోని ఆర్‌సీఎం సెయింట్ థామస్, చిన
దేవాలయాలు, చర్చిలపై అన్యమత రాతలు
వాటిని ప్రతిపక్షానికి అంటగడుతూ నోరు పారేసుకున్న మంత్రి అనిత
అంతకుముందే అసలు కారణాలు
వెల్లడించిన ఎస్పీ
జలుమూరు ఘటనపై నిందితులను అరెస్టు చేసిన
సందర్భంగా ప్రచురితమైన కథనం