
● తూరుపు వేలుపు విలాసం
శ్రీకాకుళం నగరంలో చర్చి గోడలపై అన్యమత రాతలు రాసిన వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంగా ప్రచురితమైన కథనం
బజారు రోడ్డులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్, అదే వీధికి చెందిన గ్రంథి సోమశేఖర్‌లను కూడా అరెస్ట్ చేశామని ఎస్పీ ఈ నెల 3వ తేదీనే మీడియాకు తెలిపారు. తద్వారా ఈ రెండు ఘటనలు వేర్వేరని స్పష్టం అవుతోంది.
దీన్నేమంటారు?
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళంలో ఉన్నది వారు నియమించిన ఎస్పీయే. ఇక్కడ జరిగిన ఘటనలపై విచారణ జరిపిన తర్వాత ఆయా ఘటనలకు గల కారణాలను, నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరించారు. కానీ హోంమంత్రి అనిత మాత్రం అందుకు భిన్నంగా మంగళవారం స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి ఆపాదించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. ఇప్పుడు ఇక్కడ ఎవరివి క్రిమినల్ పాలిటిక్స్? దీన్నిబట్టి హోం మంత్రి అనిత ఎంత దారుణంగా అబద్ధాలు, అవాస్తవాలను వల్లిస్తున్నారో అర్థమవుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఏం జరిగినా దానిని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారనడానికి ఈ ఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు.
విద్యార్థులకు
చిత్రలేఖన పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలతోపాటు చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖన పోటీల నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మండల స్థాయి చిత్రలేఖన పోటీలు ఈ నెల 17న మండల కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. అందులో ప్రథమ, ద్వితీయ స్థాయిల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయాలని మండల విద్యాశాఖాధికారులకు సూచించారు. జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీలు ఈ నెల 18న శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 19న బహుమతుల ప్రదానం చేస్తామని తెలిపారు.
మొదట్లో ఈ వ్యాపారం పెట్టినప్పుడు మాకు ఎంతో ఆందోళన ఉండేది. భారీగా అప్పు చేశాం. విజయం సాధిస్తామా లేదా అనే అనుమానంతోనే భార్యాభర్తలం ఇద్దరం కష్టపడ్డాం. నేడు విజయవంతమైన వ్యాపారం నడుపుతున్నాం. మరో పదిమందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం.
– డొంకాన స్వాతి, గొండ్యాలపుట్టుగ
●
ఉపాధి కల్పిస్తూ..

● తూరుపు వేలుపు విలాసం