
ఆ పాపం కింజరాపు కుటుంబానిదే..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో నాలుగు దశాబ్దాల కాలంగా కింజరాపు కుటుంబీకుల పాలన సాగుతోందని, జిల్లాను తలసరి ఆదాయంలో చివరిస్థానంలో ఉంచిన ఘనత వారిదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ఆయన గురువా రం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పెద్దరికం చేసి జిల్లాకి వారు చేసింది సున్నా అని గమనించాలన్నారు. జిల్లాలో మూలపేట పోర్టు వైఎస్సార్‌సీపీ గ్రౌండ్ చేసిందని, అంతేకాకుండా ఫిష్ ల్యాండింగ్‌సెంటర్లు, పోర్టులు కూడా తమ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టామని గుర్తు చేశారు. గ్రా మాలకు బస్సులు వేయలేనివారు జిల్లాలో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన పనులకే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి కూటమి నాయకులు గొ ప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కనీస అవసరా లు తీర్చకుండా అవసరం లేని ఆర్భాటాలు చేస్తున్నారని తెలిపారు. 30 ఏళ్ల పాటు పాలించినా ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోయారని తెలిపారు. ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేస్తామన్నా ప్రజలు, ప్రజాసంఘాలు, కమ్యూనిస్టులు అడ్డుతగులుతున్నారని వారు చెప్పడం సిగ్గుచేటన్నారు.