
21 నుంచి స్లాట్‌తోనే రిజిస్ట్రేషన్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు ఈ నెల 21వ తేదీ నుంచి స్లాట్‌ను బుక్ చేసుకుని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే రిజిస్ట్రేషన్లు జరగవని జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌ల ద్వారా జరగనున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వుల మేరకు రాబోయే సోమవారం ఏప్రిల్ 21 నుంచి జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే విధానంలో రిజిస్ట్రేషన్లు ఉంటాయని తెలిపారు. ఈ స్లాట్‌లు ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బుక్ చేసుకునే వీ లుంటుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలున్నా తమ పరిధిలో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నా రు. అదేవిధంగా ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఒక రోజు ముందుగా ఈ స్లాట్ బుకింగ్ విధానంలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని తెలిపారు.
విద్యారంగాన్ని
టీచర్లే కాపాడాలి
టెక్కలి రూరల్: పాలకుల విధానాల ఫలితంగా ప్రభుత్వ బడులకు ముప్పు ఏర్పడరాదని, ప్రస్తుత ప్రభుత్వ విద్యారంగాన్ని ఉపాధ్యాయులే కాపాడుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లండ బాబురావు అన్నారు. ఆయన కోటబొమ్మాళిలో శనివారం జరిగిన యూటీఎఫ్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యారంగం ఉంటేనే పేద ప్రజలకు విద్య అందుతుందని అయన అన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని కోరారు.

21 నుంచి స్లాట్‌తోనే రిజిస్ట్రేషన్